NTV Telugu Site icon

Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది..

Avika Gor

Avika Gor

సాధారణంగా సినీ తారలు, క్రికెటర్లకుమధ్య సంబంధం ఈనాటిది కాదు. సంవత్సరాలుగా రెండు రంగాల మధ్య మంచి కమ్యూనికేషన్ బాగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్ల మధ్య ఇది కాస్త ఎక్కువగా ఉంది. చాలా పార్టీలలో వీరంతా ఒకరినొకరు కలిసేందుకు సందడి చేస్తారు. అంతేకాదు, విదేశీ క్రికెటర్లు బాలీవుడ్ పరిశ్రమలోని తారలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. ఇక్కడ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ నటులతో స్నేహంగా ఉన్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లకు నటులతో కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్.. కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, హీరోయిన్ అవికా గోర్ కలిసి పని చేసారు. తాజాగా వీరిద్దరూ చేసింది ఓ ప్రత్యేక ఆల్బమ్ విడుదల చేయబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also read: Chinese Man: యూట్యూబ్ నే మోసం చేసిన ఘనుడు.. ఏకంగా 3.5 కోట్లు..

ఆండ్రీ రస్సెల్ ఒక వైపు క్రికెట్ ఆడుతూ, మరోవైపు ఆల్బమ్‌లను రికార్డ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ విజయానికి తనవంతు సహకారం అందిస్తున్నాడు. ఈ క్రికెటర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోయిన్ అవికాగోరతో ప్రత్యేక ఆల్బమ్ రూపొందించాడు. ‘లడ్కీ తూ కమల్ కీ’ పాటతో పాటు అవికా గోర్‌ తో హిందీ ఆల్బమ్‌ తో రస్సెల్ స్మార్ట్ మూవ్స్‌తో అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ పాటను రస్సెల్ స్వయంగా పాడారు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్‌లో స్టైలిష్‌గా కనిపించాడు రస్సెల్. ఇక అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకుంది. వీరిద్దరి ప్రత్యేక ఆల్బమ్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది.

Also read: AP High Court: లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు

చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్నారి పెళ్లి కూతురు అనే సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆవిక, ఉయ్యాల జంపాలా సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు ఆవిక గౌర్.