Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినీ తారలు, క్రికెటర్లకుమధ్య సంబంధం ఈనాటిది కాదు. సంవత్సరాలుగా రెండు రంగాల మధ్య మంచి కమ్యూనికేషన్ బాగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్ల మధ్య ఇది కాస్త ఎక్కువగా ఉంది. చాలా పార్టీలలో వీరంతా ఒకరినొకరు కలిసేందుకు సందడి చేస్తారు. అంతేకాదు, విదేశీ క్రికెటర్లు బాలీవుడ్ పరిశ్రమలోని తారలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. ఇక్కడ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ నటులతో స్నేహంగా ఉన్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లకు నటులతో కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్.. కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, హీరోయిన్ అవికా గోర్ కలిసి పని చేసారు. తాజాగా వీరిద్దరూ చేసింది ఓ ప్రత్యేక ఆల్బమ్ విడుదల చేయబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also read: Chinese Man: యూట్యూబ్ నే మోసం చేసిన ఘనుడు.. ఏకంగా 3.5 కోట్లు..
Also Read
ఆండ్రీ రస్సెల్ ఒక వైపు క్రికెట్ ఆడుతూ, మరోవైపు ఆల్బమ్‌లను రికార్డ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ విజయానికి తనవంతు సహకారం అందిస్తున్నాడు. ఈ క్రికెటర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోయిన్ అవికాగోరతో ప్రత్యేక ఆల్బమ్ రూపొందించాడు. ‘లడ్కీ తూ కమల్ కీ’ పాటతో పాటు అవికా గోర్ తో హిందీ ఆల్బమ్ తో రస్సెల్ స్మార్ట్ మూవ్స్‌తో అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ పాటను రస్సెల్ స్వయంగా పాడారు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్‌లో స్టైలిష్‌గా కనిపించాడు రస్సెల్. ఇక అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకుంది. వీరిద్దరి ప్రత్యేక ఆల్బమ్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది.
Also read: AP High Court: లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్నారి పెళ్లి కూతురు అనే సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆవిక, ఉయ్యాల జంపాలా సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు ఆవిక గౌర్.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?