Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?
- లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో ఆవేశ్ ఖాన్ చర్య వివాదాస్పదం
- బౌండరీ దాటకముందే బంతిని బ్యాట్‌తో మైదానంలోకి కొట్టిన ఆవేశ్
- క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది డెడ్ బాల్‌గా పరిగణించే అవకాశం
- ఫీల్డర్ కాని వ్యక్తి బంతిని అడ్డుకుంటే 5 పరుగుల పెనాల్టీ అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avesh Khan Controversy: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మహమ్మద్ షమీ తన బౌలింగ్ మ్యాజిక్ తో తొలుత అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7)లను అవుట్ చేసి సన్‌రైజర్స్ ను దెబ్బతీశాడు. హెన్రిచ్ క్లాసెన్ (62), నితీష్ కుమార్ రెడ్డి (56) పోరాడటంతో హైదరాబాద్ 156 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లక్నోను కెప్టెన్ రిషబ్ పంత్ ముందుండి నడిపించాడు. పంత్ అజేయంగా 68 పరుగులు చేసి జట్టుకు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
అయితే ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పేసర్ ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించారనే వార్త ఇప్పుడు క్రీడా వర్గాల్లో తెగ చెక్కర్లు కొడుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో విజయం సాధించిన వేళ, బౌండరీ లైన్ వద్ద ఆవేశ్ చేసిన ఓ పని వివాదానికి దారితీసింది. దీనివల్ల అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.
లక్నో విజయాన్ని అందుకునే సమయంలో.. బౌండరీ లైన్ అవతల బ్యాటింగ్ ప్యాడ్లు కట్టుకుని ఉన్న ఆవేశ్ ఖాన్, బంతి బౌండరీ లైన్ ను దాటకముందే అత్యుత్సాహంతో దాన్ని బ్యాట్ తో మల్లి గ్రౌండ్ లోకి కొట్టాడు. జట్టు విజయాన్ని ముందే ఊహించి సంబరాలు చేసుకునే క్రమంలో అతను చేసిన ఈ పనిని చూసి తోటి ఆటగాడు అర్షిన్ కులకర్ణి సైతం ఆశ్చర్యపోయాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఫీల్డర్ కాని వ్యక్తి మైదానంలో బంతిని అడ్డుకుంటే అది డెడ్ బాల్ గా పరిగణించడమే కాకుండా, ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల పెనాల్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంపైర్లు పెనాల్టీ విధించి ఉంటే, లక్నో చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి వచ్చేది. అయితే సన్‌రైజర్స్ ఆటగాళ్లు దీనిపై అప్పీల్ చేయకపోవడంతో పెద్ద సమస్య కాలేదు.
US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..
లక్నో విజయాన్ని ఈ వివాదం అడ్డుకుంటుందా అనే కోణంలో నిశితంగా పరిశీలిస్తే.. ఆవేశ్ ఖాన్ చర్య వల్ల నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టమవుతోంది. క్రికెట్ లా 19 ప్రకారం, బంతి బౌండరీ లైన్ ను దాటిన వెంటనే లేదా అవతల పడిన వెంటనే అది ‘డెడ్ బాల్’ అవుతుంది. ఆ షాట్ నేరుగా బౌండరీ దాటి వెళ్లడం వల్ల దాన్ని బౌండరీగా పరిగణించారు. అలాగే, లా 41 ప్రకారం.. ప్రత్యర్థిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడానికి లేదా ఆటను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఇక్కడ ఆవేశ్ డగౌట్ సమీపంలో ఉన్నాడు. దీనితో అతని చర్య వల్ల సన్ రైజర్స్ ఫీల్డర్లకు బంతిని ఆపే విషయంలో ఎటువంటి ఆటంకం కలగలేదు. అందుకే అంపైర్లు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మారి ఉండేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.
OVER THE IN-FIELD! 😍
Captain Rishabh Pant guides the chase and finishes it off in style 🤌@LucknowIPL off the mark on the points table +2️⃣
Scorecard ▶️ https://t.co/qC2rF1Hiiz#TATAIPL | #KhelBindaas | #SRHvLSG pic.twitter.com/SEDFsub4UD
— IndianPremierLeague (@IPL) April 5, 2026
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?