మార్వెల్ సినీ యూనివర్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Avengers: Doomsday’ సినిమా టీజర్‌ను అధికారికంగా విడుదల చేయగా, దీనితో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఎవెంజర్స్ డూమ్స్ డే టీజర్ డార్క్ టోన్‌లో సాగుతూ, భారీ యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, మరొక కొత్త సమస్య, ప్రపంచ వినాశనం, అవెంజర్స్ భవిష్యత్తు చుట్టూ కథ తిరగబోతున్నట్లు టీజర్ లో చుపించారు. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ షాట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఈ చిత్రంలో పాత అవెంజర్స్‌తో పాటు కొత్త హీరోలు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. MCUలో ఇప్పటివరకు చూసిన కథలకు ఇది ఒక టర్నింగ్ పాయింట్‌గా మారనుందని మార్వెల్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్ చివర్లో కనిపించిన కెప్టెన్ మర్వెల్ షాట్ హైలెట్ అని చెప్పాలి. ‘Avengers: Doomsday’ సినిమాను 2026 డిసెంబరు 18 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మార్వెల్ స్టూడియోస్ ప్రకటించింది. ఐమ్యాక్స్ తో పాటు 3D ఫార్మాట్లలో ఈ మూవీ విడుదల కానుంది. టీజర్‌తో మార్వెల్ మరోసారి గ్లోబల్ హైప్ క్రియేట్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో అవెంజర్స్ ఫీవర్ ను పెంచేశారు మేకర్స్.
