AV Infra Fraud Case: రియల్ ఎస్టేట్ రంగంలో ఏవీ ఇన్‌ఫ్రా కంపెనీకి సంబంధించిన భారీ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మాదాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏవీ ఇన్‌ఫ్రా (AV Infra) కంపెనీ పేరుతో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను మోసగించిన ఘటన తాజాగా బయటపడింది. ఈ మోసానికి సంబంధించి కంపెనీ సీఎండీ విజయ్ గోగులను సైబరాబాద్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు.
Read Also:Jagtial: 800 క్వింటాళ్ల అక్రమ PDS రైస్.. దాడులు చేసి పట్టుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్..!
‘బై బ్యాక్ పథకం’ పేరిట పెట్టుబడులు చేయమని ఆశ చూపించి 18 నెలల్లో 50 శాతం అదనపు లాభం ఇస్తామని విజయ్ గోగుల హామీ ఇచ్చాడు. ఒకవేళ డబ్బు ఇవ్వలేకపోతే, తమ పేర్లకు భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాడు. దీనితో 500 మందికి పైగా బాధితులు ఏవీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లో పెట్టుబదులు పెట్టారు. ఇలా మొత్తం రూ. 200 కోట్లు వరకు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also:Crime News: దారుణం.. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కసాయి కొడుకు..!
నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా వంటి ప్రాంతాల్లో వెంచర్లు వేస్తున్నామని, వాటిలో ప్లాట్‌లు అబంధిస్తామని కంపెనీ తెలిపింది. వెంచర్ల అభివృద్ధి చేస్తామంటూ ముందుగా డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయకుండా మోసం చేసినట్లు విచారాలో బయట పడింది. మాదాపూర్ లోని ఏవీ ఇన్‌ఫ్రా ఆఫీసు ద్వారా ఈ మొత్తం దందా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉచ్చుకు గురైన బాధితులు గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం విజయ్ గోగులను విచారించగా, మిగిలిన బాధితుల వివరాలు, డబ్బు లావాదేవీలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు.
