Site icon NTV Telugu

Andela Sriramulu: ఆటో యూనియన్ల మద్దతు అందెలకే

Andela

Andela

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీ నేతలు ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. అందులో భాగంగానే.. మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజురోజుకీ ఆయనకు ప్రజలు, యువత నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో.. అందరి చూపు ఆ నియోజకవర్గంపై ఉంది.

Read Also: Pawan Kalyan: జన్మనిచ్చిన తెలంగాణకు సేవ చేయాలనే వచ్చా..

మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబ్బండ వర్గాల మద్దతు అందెల శ్రీరాములుకు లభిస్తుంది. ఈ క్రమంలో.. అందెల శ్రీరాములుకు ఆటో యూనియన్లు మద్దతు పలికాయి. చలాన్లతో మా పొట్ట కొడుతున్నారని ఆటో డ్రైవర్లు అందెలకు వివరించారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ అధికారంలోకి రాగానే ఆటోవాలాలకు ఉచితంగా PM ప్రమాదబీమా అందిస్తానని చెప్పారు. ఈ ఆదరణ ఎన్ని జన్మల పుణ్యమో అంటూ.. మీ రుణం తీర్చుకుంటా అని హామీ ఇచ్చారు.

Read Also: Anand Mahindra: ఈమే నా హీరో.. 97 ఏళ్ల బామ్మ సాహసానికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా

ఈ సందర్భంగా.. మీర్పేట్ కార్పొరేషన్ నుంచి బీజేపీ నాయకులు చవ్వ శ్రవణ్, బీజేవైఎం అధ్యక్షులు ముఖేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఆటోలలో తరలివచ్చారు. అనంతరం.. అనేక సమస్యలను శ్రీరాముల దృష్టికి తెచ్చారు. ప్రమాదబీమా, ఆటో స్టాండ్లు, ట్రాఫిక్ చలాన్ల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని… వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటోవాలాలు శ్రీకాంత్, శ్రీనివాస్ సహా స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version