NTV Telugu Site icon

Auto House: ఆటోను ఇంటి పైకి ఎక్కించేసిన డ్రైవర్.. అలాఎందుకు చేసాడంటే..

Auto

Auto

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఇకపోతే తాజాగా ఆటో డ్రైవర్ చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకాలం తన కుటుంబాన్ని పోషించిన ఆటోను పాతదైపోయిందని వదిలేయకుండా ఆ ఆటో డ్రైవర్ ఏకంగా ఆటోను తన ఇంటి పైకి చేర్చి అందరికీ కనపడేలా పెట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

IPL 2024 Final: ట్రోఫీతో కమిన్స్, శ్రేయాస్ ఫొటో షూట్.. పడవ, ఆటోలో మాములుగా లేదుగా

కంటి ముందర ఉండే తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఆటో డ్రైవర్ ఉండడంతో నెటిజెన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా రోజుల నుండి తనతో పాటు తన కుటుంబానికి అన్నం పెట్టిన ఆటో తనను ప్రయోజకుడ్ని చేసిందని అందుకు తాను ఆటోకు కృతజ్ఞత చూపించాలని ఈ పని చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా తనకి ఓ సొంతింటి కల కూడా ఉండదని., అందుకోసం ఆటో నడుపుకోవడం వల్లే తాను బ్రతకడమే కాకుండా మరింత డబ్బు కూడగట్టుకుని ఓ ఇల్లు కూడా కట్టుకోవడంతో తన సొంతింటి కల నెరవేడంతో ఆటోను పక్కన పెట్టకుండా అదే ఇంటిపై ఏర్పాటు చేసుకున్నాడు.

Gujarat: గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది సజీవదహనం

ఈ ఆటో డ్రైవర్ చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సమాజంలో చాలామంది సొంతవారిని పట్టించుకోవట్లేదని.. నువ్వు నీ ఆటోని కూడా విడిచి పెట్టట్లేదు అంటూ గ్రేట్ అంటూ అతన్ని పొగడ్తలతో ప్రసశంసలను కురిపిస్తున్నారు. మరికొందరైతే కాస్త ఫన్నీగా ఆటో కాబట్టి సరిపోయింది.. ఒకవేళ లారీ అయితే ఎలా పరిస్థితి అంటూ కామెంట్ చేశారు.

Show comments