Site icon NTV Telugu

Bengaluru Auto Driver: బెంగుళూరు వెళ్తే ఆటో డ్రైవర్లతో జాగ్రత్త.. యూట్యూబర్ కు చేదు అనుభవం

Auto

Auto

Auto Driver Cheated Bangladesh Youtuber: కొంత మంది ఆటో డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన జేబు ఖాళీ చేసేస్తారు. ఊరికి కొత్తగా కనిపిస్తే చాలు ఎక్కడ లేని రేటు చెప్పేస్తారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన యూట్యూబర్ కు అలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. తాను డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదంటూ ఆటో డ్రైవర్ తన వద్ద మళ్లీ డబ్బులు వసూలు చేశారు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆటో డ్రైవర్ చేసిన మోసం బయటపడటంతో సదరు వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసి బెంగుళూరులో ఆటో డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్‌.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో
వివరాల ప్రకారం బంగ్లాదేశ్ యూట్యూబర్ ఎండీ ఫిజ్ బెంగుళూరులో ఓ ఆటో ఎక్కాడు. అయితే తన గమ్యస్థానానికి చేరుకోగానే ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇచ్చాడు. అయితే ఆటో డ్రైవర్ రూ.300 అయ్యిందని, మీరు రూ.100లే ఇచ్చాడని చెప్పాడు. దీంతో తానే తప్పుగా ఇచ్చాను అనుకొని ఆ యూట్యూబర్ రూ. 500 ఆ ఆటో డ్రైవర్ కు ఇచ్చాడు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ చిల్లర ఇవ్వబోతుంటే తననే ఉంచుకోమని చెప్పాడు యూట్యూబర్. అయితే తన ప్రయాణాన్ని అంతా యూట్యూబర్ రికార్డు చేసుకున్నాడు. దానిని ఎడిట్ చేస్తున్నప్పుడే అతనికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. మొదట అతడు యూట్యూబర్ కు రూ.500 ఇచ్చాడు. అయితే ఆటో డ్రైవర్ దానిని తన షర్ట్ చేతి మడతల్లో దాచేశారు. తరువాత వందే ఇచ్చారని యూట్యూబర్ కు చూపించాడు. దీంతో యూట్యూబర్ ఆ వంద తీసుకొని మరో రూ. 500 ఆ డ్రైవర్ కు ఇచ్చాడు. డ్రైవర్ చేసిన మోసాన్ని పోస్ట్ చేస్తూ బెంగుళూరులో డ్రైవర్ తో జాగ్రత్తగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు కూడా నిజంగానే బెంగుళూరులో జాగ్రత్తగా ఉండాలంటూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్ చేసిన పనితో బెంగుళూరు పరువు పోయినంత పనయ్యింది. అంతేకాదు ఇలా చేసిన చాలా కేసుల్లో బెంగుళూరు ఆటో డ్రైవర్లపై ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి.

Exit mobile version