Site icon NTV Telugu

Annamayya District: అమానుషం.. 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్

Child

Child

చెట్టుకు చీరకట్టినా వదలన్నట్టున్నరు కామాంధులు. ఇటీవల దేశవ్యాప్తంగా లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నపిల్లలు, చివరికి వృద్ధ మహిళలను కూడా వదలడం లేదు. మరికొందరు మృగాలు మైనర్ బాలుడిపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లిలో ఈనెల 27న ఇంటి ముందు సైకిల్ తోక్కుకుంటున్న 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Also Read:CM Revanth Reddy: ప్ర‌జావ‌స‌రాలకు అనుగుణంగా లింక్ రోడ్లు….

అదే గ్రామానికి చెందిన నిందితుడు ఆటో డ్రైవర్ తిరుపతి రమేశ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అతడి చెర నుంచి తప్పించుకున్న బాలుడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని వివరించాడు. బాధితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు తిరుపతి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version