నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్ వారు పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రలుకు అవగాహన సదస్సుకు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో ప్రస్తుత పరిస్థుల్లో పిల్లలకు ఆటిజం అనేది విపరీతంగా వ్యాప్తిస్తుందని ఇది పిల్లల ఎదుగుదలకు మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది. తల్లిదండ్రుల ప్రస్తుత జీవనశైలి కూడా పిల్లల్లో ఆటిజంకి ఒక కారణం అని ఆటజం దీన్ని అరికట్టడానికి డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్ వారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, ఎంతో ఉపయోగకరమని డాక్టర్ ఎ.ఎం రెడ్డిని కొనియాడారు.
Read Also: India Vs New Zealand: ఓ విరాట్- షమీ.. మరో వైపు డిస్నీ హాట్ స్టార్.. రికార్డుల వర్షం
ఇక, ఈ సందర్భంగా డాక్టర్ ఎ.ఎం రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు వ్యాక్సిన్లు, యాంటి బయోటిక్ మందులు వాడటం వలన వారి మెంటల్, ఫిజికల్ హెల్త్ సమస్యలు వస్తాయని, పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులకు ఆస్తులు ఒక్కటే కాకుండా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నారు. దీనిని అరికట్టి పిల్లల భవిష్యత్తుని ఆనందకరంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హోమియోపతిలో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆటిజం ను నిర్మూలించవచ్చు అన్నారు.