NTV Telugu Site icon

Second Alert: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక.. రంగంలోకి 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Bareje

Bareje

Second Alert: కృష్ణానది వరద నీటి ఉధృతితో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కలుగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. 3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు చేరుకున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అలాగే, వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో చాపర్ పాల్గొనింది.

Read Also: Uttarpradesh : తోడేళ్ల దాడులకు నిస్సహాయంగా చూస్తున్న వ్యవస్థ.. 10మంది మృతి

ఇక, ప్రకాశం బ్యారేజీ వద్ద 69వ కానా డ్యామేజీ అయింది. బ్యారేజీని ఢీకొట్టిన నాలుగు బోట్లు‌.. ప్రవాహ వేగం మరింతగా పెరగడంతో పక్క కానాలకు కూడా బోట్లు గుద్దుకుంటున్నాయి. వెంటనే క్లియర్ చేయకపోతే మరింత డ్యామేజీ అయ్యే ప్రమాదం ఉంది. ఇక, మరికాసేపట్లో విజయవాడకు మరో 4 చాపర్స్ రానున్నాయి. ప్రజలు భయాందళోనకు గురికావొద్దు అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి అని సూచించారు.