NTV Telugu Site icon

Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. విచారణ ప్రారంభం

Train Accident

Train Accident

Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.. పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకోగా.. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 50 మందికి తీవ్రగాయాలపాలయ్యారు.. ఇక, మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

Read Also: Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా..

అయితే, విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.. కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు కమిషన్ అధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఐజీ.. ఓవైపు 20 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి.. ఈ ప్రమాదంలో నిజ్జునుజ్జయిన ఏడు బోగీలను తొలగించారు.. విజయవాడ-విశాఖపట్నం అప్ లైన్ & డౌన్ లైన్ పనులు పూర్తి చేశారు.. మిడిల్ లైన్ ఆపరేషన్స్ లోకి రావడానికి మరికొద్ది గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.. అందుబాటులోకి వచ్చిన అప్ & డౌన్ లైన్లలో ట్రైన్ల రాకపోకల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, ప్రమాదానికి గల పూర్తి కారణాలు సేఫ్టీ కమిషన్ విచారణ తర్వాత తేలనుంది.. పలాస ప్యాసింజర్ ను వెనుక నుంచి రాయగఢ్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని డీఆర్ఎం సౌరభ్ కుమార్ తెలిపారు.. ఇక, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని.. అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. కాగా, ఈ రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు ప్రకటించిన విషయం విదితమే.