FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: 28 ఏళ్ల విరామం తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రియా జట్టు విజయంతో ప్రారంభించింది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్ర జట్టు జోర్డాన్ పై 3-1 తేడాతో భారీ విజయం సాధించింది ఆస్ట్రియా. రొమానో ష్మిడ్ తొలి అర్ధభాగంలో చేసిన గోల్‌తో పాటు జోర్డాన్ డిఫెండర్ యజాన్ అల్ అరబ్ చేసిన సెల్ఫ్ గోల్, అదనపు సమయంలో మార్కో ఆర్నాటోవిచ్ సాధించిన పెనాల్టీ గోల్ ఆస్ట్రియాకు విజయాన్ని అందించాయి.
మ్యాచ్ మొదటి నుంచే జోర్డాన్ దూకుడుగా ఆడింది. రెండో నిమిషంలోనే కెప్టెన్ ఎహ్సాన్ హద్దాద్ గోల్ చేసే అవకాశం దక్కించుకున్నప్పటికీ అతని షాట్ సైడ్ నెట్‌ను మాత్రమే తాకింది. అనంతరం ఒదె ఫఖౌరీ దూరం నుంచి బలమైన షాట్ కొట్టగా.. ఆస్ట్రియా గోల్‌కీపర్ అలెగ్జాండర్ ష్లాగర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. జోర్డాన్ ఒత్తిడిని తట్టుకున్న ఆస్ట్రియా 20వ నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లింది. పెనాల్టీ బాక్స్ అంచు వద్ద బంతిని అందుకున్న రొమానో ష్మిడ్ శక్తివంతమైన షాట్‌తో బంతిని నేరుగా గోల్‌పోస్ట్ లోకి పంపించి తన జట్టుకు తొలి గోల్ అందించాడు.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
రెండో అర్ధభాగం ప్రారంభమైన ఐదు నిమిషాలకే జోర్డాన్ సమం చేసింది. నూర్ అల్ రావాబ్దెహ్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న అలీ ఒల్వాన్ అద్భుతమైన సోలో రన్‌తో ఆస్ట్రియా రక్షణను ఛేదించి గోల్ సాధించాడు. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో గోల్ చేసిన తొలి జోర్డానియన్ ఆటగాడిగా ఒల్వాన్ నిలిచాడు. 67వ నిమిషంలో మార్కో ఆర్నాటోవిచ్ గోల్ చేసినా, వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష అనంతరం స్టెఫాన్ పోష్ హ్యాండ్‌బాల్ చేసినట్లు తేలడంతో ఆ గోల్‌ను రద్దు చేశారు. దీంతో స్కోరు 1-1తో కొనసాగింది. అయితే కొద్దిసేపటికే ఆస్ట్రియా మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. జోర్డాన్ డిఫెండర్ యజాన్ అల్ అరబ్ పొరపాటున తన గోల్‌పోస్ట్‌లోకే బంతిని పంపడంతో ఆస్ట్రియాకు 2-1 ఆధిక్యం లభించింది.
మ్యాచ్ ముగిసే సమయానికి జోర్డాన్ సమం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అదనపు సమయంలో ఆస్ట్రియాకు పెనాల్టీ లభించగా.. అనుభవజ్ఞుడు మార్కో ఆర్నాటోవిచ్ ఎలాంటి తప్పు చేయకుండా గోల్‌గా మలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో ఆస్ట్రియా వరల్డ్‌కప్ 2026 ను ఘనంగా ప్రారంభించగా, జోర్డాన్ పోరాడినప్పటికీ ఓటమితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆస్ట్రియా ఇప్పటివరకు ఆడిన 30 ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఒక్కటీ గోల్స్ లేకుండా ముగియలేదు.
+3 for Austria 🇦🇹#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 17, 2026
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!