Site icon NTV Telugu

Australia vs India 3rd T20I: టిమ్ డేవిడ్, స్టోయినిస్ దూకుడు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..!

Australia Vs India 3rd T20i

Australia Vs India 3rd T20i

Australia vs India 3rd T20I: హోబార్ట్ లో భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (1), మిచెల్ మార్ష్ (11) లు త్వరగా ఔటవడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. అయితే మధ్యలో బ్యాటింగ్‌కు వచ్చిన టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ జోడీ దుమ్మురేపారు.

Realme P3x 5G: Realme 5G ఫోన్ పై వేలల్లో డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ,50MP కెమెరా

టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు, స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 పరుగులతో అదరగొట్టారు. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. చివర్లో మాథ్యూ షార్ట్ కూడా 15 బంతుల్లో 26 పరుగులతో జట్టుకు మంచి మద్దతు అందించాడు. ఇక భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ అత్యుత్తమంగా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, షివమ్ దూబే ఒక వికెట్ తీశాడు. ఇక ఇప్పుడు భారత్ ముందు 20 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యం ఉంది. ఈ భారీ టార్గెట్‌ను చేధించడం అంత సులభం కాదు.. చూద్దాం మరి భారత బ్యాటర్స్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎలా ఎదురుకుంటారో..?

Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి ఎలక్ట్రిక్ 7-సీటర్ లాంచ్‌కు సిద్ధం..

Exit mobile version