Site icon NTV Telugu

Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..

Anthony Albanese

Anthony Albanese

Australian PM Wedding: ప్రధాని హోదాలో ఒకరు వివాహం చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తన పదవీకాలంలో వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ ప్రధాని ఎవరో తెలుసా.. ఆంథోనీ అల్బనీస్‌. ఆయన 62 ఏళ్ల వయసులో శనివారం తన చిరకాల స్నేహితురాలు జోడీ హైడెన్‌ను వివాహం చేసుకున్నారు.

READ ALSO: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ‘‘రాజీ’’కి కారణాలు ఇవేనా?

ఈ పెళ్లి వేడుకలు కాన్‌బెర్రాలోని ఆంథోనీ అధికారిక నివాసం ది లాడ్జ్‌ తోటలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగాయి. తాజాగా ఈ విషయాన్ని ఆంథోనీ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన జీవిత భాగస్వామి చేతిని పట్టుకొని నడుస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మెల్‌బోర్న్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన ఓ వ్యాపార విందులో వీళ్లిద్దరూ తొలిసారిగా కలుసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గత కొన్నేళ్లుగా హైడెన్‌, ఆంథోనీలు పలు కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నారు. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆంథోనీకి ఇది రెండో వివాహం. 2019లో ఆయన తన భార్యకు విడాకులిచ్చారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

జోడీ హేడెన్ ఎవరు..
ఫిబ్రవరి 14, 2024న వాలెంటైన్స్ డే రోజున అల్బనీస్ జోడి హేడెన్‌కు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తనతో జీవితాంతం గడపాలనుకునే భాగస్వామి దొరికిందని చెప్పాడు. ఇదే సమయంలో జోడి హేడెన్ చాలా కాలంగా అల్బనీస్‌తో ఉన్నారు. 2022 ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె ప్రధానమంత్రితో కలిసి పనిచేశారు.

READ ALSO: Varanasi: బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో ‘వారణాసి’ టైటిల్ ఇదేనా!

Exit mobile version