NTV Telugu Site icon

ICC World Cup: నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. గెలుపెవరిదో?

Cricket

Cricket

ICC World Cup: ప్రపంచకప్ ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు. సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అందువల్ల, రెండు జట్లు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఢీకొంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ గొప్ప మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు. అయితే సౌతాఫ్రికా స్వదేశంలో ఆడుతోంది. దక్షిణాఫ్రికా అభిమానులు తమ జట్టు ఫైనల్‌కు చేరుకున్నందుకు ఆనందంగా వారు ర్యాలీ నిర్వహించారు.

Read Also: Bird Flu: జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.. 4000 కోళ్లను చంపనున్న ప్రభుత్వం

ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం ఇది 7వ సారి. అలాగే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను వరుసగా 2 సార్లు కైవసం చేసుకుంది. 2020లో టీమిండియాను, 2018లో ఇంగ్లండ్‌ను ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడించింది. అందువల్ల ఈ ఏడాది ప్రపంచకప్ గెలిచి హ్యాట్రిక్ పూర్తిచేసే అవకాశం ఆస్ట్రేలియాకు ఉంది. మరోవైపు పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా జట్లుతో ఆస్ట్రేలియా సవాల్‌ ఎదురవుతుంది. అందుకే అనుభవం ఉన్న ఆస్ట్రేలియా గెలుస్తుందా.. లేక స్వదేశంలో సౌతాఫ్రికా రాణిస్తుందా అనే దానిపైనే క్రికెట్ ప్రపంచం దృష్టి ఉంటుంది.

Read Also: Off The Record: మంత్రి తానేటి వనితకు అసమ్మతి సెగ..! సొంత సామాజికవర్గం నేతలే దూరం..!?

సౌతాఫ్రికా జట్టు : హీథర్ నైట్ (కెప్టెన్), ఆలిస్ కాప్సే, డానీ వాట్, మైయా బౌచిర్, సోఫియా డంక్లీ, చార్లీ డీన్, డేనియల్ గిబ్సన్, నాట్ క్వైర్, అమీ జోన్స్, లోరైన్ విన్‌ఫీల్డ్ హిల్, ఫ్రెయా డేవిస్, ఇస్సీ వాంగ్, కేట్ క్రాస్, కేథరీన్ బ్రంట్, సారా బెల్ గ్లెన్, సోఫీ ఎక్లెస్టన్.

టీమ్ సౌత్ ఆఫ్రికా : సునే లూస్ (కెప్టెన్), అన్నేరి డెర్క్సన్, లారా గూడాల్, లారా వోల్‌వార్ట్, అన్నేకే బోచ్, క్లో ట్రయాన్, డెల్మరీ టక్కర్, మారిజన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, సినాలో జాఫ్తా, తజ్మిన్ బ్రిట్స్, అయాబొంగా ఖాకా, మస్బాటా క్లాస్, షమాయిల్, ఎమ్‌మెయిల్ ఇస్లాబాన్‌కోయిమ్.