Site icon NTV Telugu

AUS vs WI: స్టార్క్-బోలాండ్ విధ్వంసం.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

Aus Vs Wi

Aus Vs Wi

జమైకాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌ను రెండో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేసి 3-0 తేడాతో ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 14.3 ఓవర్లలో 27 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. 7.3 ఓవర్లలో 4 మెయిడెన్‌లతో 9 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. 1955 తర్వాత వెస్టిండీస్‌లో ఒక ఆస్ట్రేలియన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ సాధించాడు.

Also Read:Donald Trump: ట్రంప్ ఇక నువ్వు మారవా.? భారత్-పాక్ గురించి మళ్లీ కామెంట్స్..

తన 100వ టెస్ట్ ఆడుతున్న స్టార్క్, పింక్ డ్యూక్స్ బంతితో వెస్టిండీస్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేశాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్ల మార్కును దాటాడు. సదీర్ఘ ఫార్మాట్‌లో 16వ సారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనతను సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన మొదటి ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టాడు, ఇది టెస్ట్ మ్యాచ్‌లలో రికార్డు.

Also Read:Odisha Student: లైంగిక వేధింపుల కారణంగా, నిప్పంటించుకున్న ఒడిశా విద్యార్థిని మృతి..

టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన 10వ ఆస్ట్రేలియన్ బౌలర్‌గా స్కాట్ బోలాండ్ నిలిచాడు. టీ విరామం తర్వాత అతను వెస్టిండీస్ లోయర్ ఆర్డర్‌ను చిత్తు చేశాడు. జస్టిన్ గ్రీవ్స్, షమర్ జోసెఫ్, జోమెల్ వారికన్‌లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 మంది ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టారు. ఇది కరేబియన్ జట్టుకు అత్యంత చెత్త టెస్ట్ రికార్డు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 176 పరుగుల తేడాతో గెలిచింది.

Also Read:Congress: మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెక్రటరీ అనుమానాస్పద మృతి

ఈ టెస్ట్ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 143 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్ గెలవడానికి 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ కంగారు బౌలర్ల ధాటికి వెస్టిండిస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడల్లా కూలిపోయింది.

టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు

26 — న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్, 1955

27 — వెస్టిండీస్ vs వెస్టిండీస్, 2025

30 — దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, 1896

30 — దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, 1924

35 — దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, 1899

టెస్ట్‌లలో అత్యంత వేగవంతమైన ఐదు వికెట్ల ప్రదర్శన

15 బంతులు – మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) vs వెస్టిండీస్, 2025

19 బంతులు – ఎర్నీ తోషాక్ (ఆస్ట్రేలియా) v ఇండియా, 1947

19 బంతులు – స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) vs ఆస్ట్రేలియా, 2015

19 బంతులు – స్కాట్ బోలాండ్ (AUS) vs ENG, 2021

Exit mobile version