Site icon NTV Telugu

AUS vs SA: ఆకాశమే హద్దుగా చెలరిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ముగ్గురు సెంచరీలతో 431 భారీ స్కోర్!

Aus

Aus

AUS vs SA: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న సౌత్ఆఫ్రికా, ఆస్ట్రేలియా 3వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్లను సౌత్ ఆఫ్రికా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకాపడ్డారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మాకేలో జరుగుతున్న మూడో వన్డేలో ఆతిథ్య జట్టు చెలరేగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 431 పరుగులు చేసింది. ఒకే ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు నమోదు కావడంతో ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది.

KTR: దమ్ముంటే ఆ 10 నియోజకవర్గాల్లో రాజీనామా చేయండి.. కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్!

ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రావిస్ హెడ్ స్టన్నింగ్ స్టార్ట్ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక మరోవైపు కెప్టెన్ మిచెల్ మార్ష్ జాగ్రత్తగా ఆడుతూ 106 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇక ఓపెనర్లు అవుట్ అయ్యాక కామెరాన్ గ్రీన్ విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం 55 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు. మరోవైపు అతనికి తోడుగా అలెక్స్ కేరీ కూడా వేగంగా 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా చివరికి 431 పరుగుల భారీ స్కోరు సాధించింది.

TTD Land Transfer Controversy: ఆ 25 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు..?

ఇక దక్షిణాఫ్రికా బౌలర్లకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షగా మారింది. కేశవ్ మహరాజ్, సీనురాన్ ముత్తుస్వామిలు చెరో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా బౌలందరు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. చూడాలి మరీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఇంత భారీ స్కోర్ ను ఛేదిస్తారో. ఇదివరకు కూడా ఒకసారి ఈ ఇరు జట్లు తలపడినప్పుడు 400+ స్కోరును చేసి క్రికెట్ ప్రేమికులకు క్రికెట్ మజ్ను అందించారు.

Exit mobile version