Site icon NTV Telugu

David Warner: అభిమానులను అలరించడానికే నిత్యం ప్రయత్నించా.. వీడ్కోలు సందర్భంగా వార్నర్‌ భావోద్వేగం!

David Warner Ground

David Warner Ground

David Warner Gets An emotional at the farewell: ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అభిమానులను అలరించడానికి నిత్యం ప్రయత్నించా అని ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. గత దశాబ్ద కాలానికిపైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారని, వారికి కేవలం కృతజ్ఞతలు మాత్రమే సరిపోవన్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో తన ప్రయాణం గొప్పగా సాగిందని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని వార్నర్ చెప్పాడు. వార్నర్ కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ (57) చేసి అభిమానులను అలరించాడు. వీడ్కోలు సందర్భంగా వార్నర్‌ మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

‘నా కల నెరవేరింది. కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకోవడం అద్భుతంగా ఉంది. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుకు గత 18-24 నెలల నుంచి గొప్ప విజయాన్ని దక్కాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా మరియు వన్డే ప్రపంచకప్ సాధించడంలో నేను భాగమయ్యా. పాక్‌తో 3-0తో ముగించడం అత్యుత్తమ విజయం. కొంతమంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆడినందుకు గర్వపడుతున్నాను. ఆసీస్ కష్టం వెనకున్న ఫిజియోలు, సిబ్బంది అత్యద్భుతం. ఈరోజు ఉదయం స్థానిక కేఫ్‌కి సాధారణంగా నడిచి వెళ్లి.. ఒక యువకుడితో కాఫీ తాగాను. నేను గర్వంగా భావించాను’ అని డేవిడ్ వార్నర్ తెలిపాడు.

Als Read: Devara Audio Rights: భారీ ధ‌ర‌కు ఎన్టీఆర్ ‘దేవర’ ఆడియో హ‌క్కులు!

‘సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్‌ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. గత దశాబ్దంలో ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారు. వారికి కృతజ్ఞతలు మాత్రమే సరిపోవు. అభిమానులు లేకుండా మేము ఏమి చేయలేము. అభిమానులను అలరించడానికే ఇక్కడికి వచ్చా. చివరి టెస్టులోనూ మంచి ఇన్నింగ్స్‌ ఆడటం సొంతోషంగా ఉంది. టీ20లతో కెరీర్‌ను ప్రారంభించా. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇక్కడి దాకా వచ్చా. నా విజయంలో కుటుంబం పాత్ర ఎంతో ఉంది. నా సతీమణి కాండిస్‌కు థ్యాంక్యూ. నా తల్లిదండ్రులు, నా సోదరుడికి ధన్యవాదాలు. కెరీర్‌లోచాలా మంది క్రికెటర్లతో కలిసి ఆడాను. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎప్పుడూ అభిమానులను అలరించడానికి ప్రయత్నించా. నా ఆటతో అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు వచ్చేలా చేశానని భావిస్తున్నా. టెస్టు క్రికెట్‌ మరింత ఉన్నతంగా మారాలని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version