NTV Telugu Site icon

Aus vs Pak: పాకిస్థాన్ ముందు తోక ముడిచిన ఆస్ట్రేలియా

Australia Vs Pakistan

Australia Vs Pakistan

Australia vs Pakistan: అడిలైడ్ వన్డేలో పాక్ జట్టు ఆస్ట్రేలియాను ఏకపక్షంగా ఓడించింది. మెల్‌బోర్న్‌లో ఓటమిపాలైన పాకిస్థాన్ జట్టు.. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారీ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అడిలైడ్ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు తమ సత్తాను ప్రదర్శించలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 35 ఓవర్లలో 163 ​​పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు 26.3 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. అడిలైడ్‌ మైదానంలో 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన పాకిస్థాన్‌కు ఈ విజయం చాలా ప్రత్యేకం. 1996లో అడిలైడ్‌లో జరిగిన వన్డేలో పాకిస్థాన్ చివరిసారిగా ఆస్ట్రేలియాను ఓడించింది.

Read Also: India–Russia Relations: భారత్‭పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు

సామ్ అయూబ్, హరీస్ రవూఫ్‌ల కారణంగా ఆస్ట్రేలియాకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ముందుగా హారిస్ రవూఫ్ తన ఫాస్ట్ బంతులతో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను కూలగొట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, ఆరోన్ హార్డీ, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్‌లను పెవిలియన్ కు చేర్చాడు. హారిస్ రౌఫ్ ఆస్ట్రేలియాపై తన అత్యుత్తమ వన్డే ప్రదర్శనను అందించాడు. అతను కేవలం 8 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి 5 వికెట్లను నేలకూల్చాడు. అంతేకాదు అడిలైడ్ మైదానంలో ఏ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత పాకిస్థాన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ సామ్ అయ్యూబ్ కేవలం 71 బంతుల్లో 82 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. స్టార్క్, హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, జంపా వంటి బౌలర్లను ఎవరిని విడిచిపెట్టలేదు. అయుబ్ అబ్దుల్లా షఫీక్‌తో కలిసి 122 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆస్ట్రేలియాను మ్యాచ్ నుండి పాకిస్థాన్ ను విజయ తీరాలకు చేర్చాడు. సామ్ అయ్యూబ్ తర్వాత, అబ్దుల్లా షఫీక్ కూడా అద్భుత అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. షఫీక్ 64 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, బాబర్ ఆజం కూడా 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి వన్డే ఆదివారం పెర్త్‌లో జరగనుంది. ఇది సిరీస్‌ డిసైడర్ గా మారింది.

Show comments