AUS vs NZ: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన కారణం. అతని మెరుపు ఇన్నింగ్స్ ముందు న్యూజిలాండ్ పోరాటం వృథ అయ్యింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. తక్కువ స్కోరుకే కీలక వికెట్లను కోల్పోయింది. అయితే, ట్రిస్టన్ రాబిన్సన్ వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కేవలం 66 బంతుల్లో 106 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో జట్టు స్కోరు 181 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కివీస్ ఇన్నింగ్స్ లో రాబిన్సన్‌కు డారిల్ మిచెల్ (34), బెవోన్ జాకోబ్స్ (20) కొంత మద్దతు ఇచ్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ రెండు వికెట్లు తీసుకోగా, హాజిల్‌వుడ్, షార్ట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Dussehra 2025: రేపే దసరా.. ఇలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.. శని దోషం పోతుంది..!
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, ఓపెనర్ మిచెల్ మార్ష్ ధనాధన్ ఆటతీరుతో ఆరంభం నుంచే పైచేయి సాధించింది. కేవలం 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 85 పరుగులు చేసి విజయాన్ని సునాయాసం చేశాడు. ట్రావిస్ హెడ్ (31), మాథ్యూ షార్ట్ (29), టిమ్ డేవిడ్ (21 నాటౌట్) కూడా విలువైన పరుగులు జోడించారు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 16.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ రెండు వికెట్లు తీసినా లాభం లేకపోయింది. మ్యాచ్‌లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు గాను మిచెల్ మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
చేతకాకపోతే రాజీనామా చేసేయండి.. Mohsin Naqviని కడిగేసిన పాక్ మాజీ ప్లేయర్
