Site icon NTV Telugu

AUS vs IND: విఫలమైన భారత బ్యాటర్లు.. ఆసీస్‌ విజయ లక్ష్యం ఎంతంటే?

Shubman Gill

Shubman Gill

క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. ఆసీస్‌ విజయ లక్ష్యం 168 రన్స్. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్. అభిషేక్‌ శర్మ (28), శివమ్‌ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (20), అక్షర్‌ పటేల్ (21) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్ ఎలిస్‌, ఆడమ్ జంపా తలో మూడు వికెట్స్ పడగొట్టారు.

Also Read: Rashmika Mandanna: ‘రౌడీ’ జిమ్ త్వరలో ప్రారంభిస్తా.. నేనే ట్రైనర్‌, వచ్చేయండి!

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్ కలిసి 56 పరుగులు చేశారు. ఆపై శివమ్‌ దూబేతో కలిసి గిల్ కొన్ని కీలక రన్స్ చేశాడు. ఈ సమయంలో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ (12) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. తిలక్‌ వర్మ (5), జితేశ్‌ శర్మ (3) నిరాశపరిచారు. ఇన్నింగ్స్ చివరలో అక్షర్‌ పటేల్‌ (21) వేగంగా పరుగులు చేశాడు.

Exit mobile version