ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ టీ20లో టాస్‌ను నెగ్గిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. టీమిండియాకు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన శుభ్‌మన్ గిల్ 5 పరుగులకే అవుట్ అయ్యారు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ వెనుదిరిగాడు. దీంతో 20 పరుగుల వద్ద తొలి వికెట్‌ను భారత్ కోల్పోయింది.
Also Read: 8 వేలు నేరుగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్ అదనం.. Redmi Note 14 Pro+ ఫోన్‌ను ఇప్పుడే కొనేసుకోండి!
4వ ఓవర్లో భారత జట్టుకు మళ్లీ షాక్ తగిలింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చిన సంజు శాంసన్ (2) విఫలమయ్యాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఎల్బీ అవగా,.. డీఆర్‌ఎస్ తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. 5వ ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1)నుహేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే లక్ వర్మ (0) డకౌట్ అయ్యాడు. తిలక్ భారీ షాట్‌కు యత్నించగా.. వికెట్ కీపర్ షార్ట్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 5 ఓవర్లకు 33/4గా ఉంది. క్రీజులో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ ఉన్నారు. టీమిండియా టాప్ బ్యాటర్ల స్కోర్ 5, 2, 1, 0గా ఉంది. భారత్ ఎన్ని రన్స్ చేస్తుందో చూడాలి.
