Site icon NTV Telugu

Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!

Aura Of Ustaad

Aura Of Ustaad

Aura of Ustaad: టాలీవుడ్‌లో ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు పుష్కర కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (UBS)తో జతకడుతుండటంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ గ్లింప్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ బయటకి వచ్చేసింది. హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో అట్టహాసంగా రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ పవన్
ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చేలా ఉంది.

READ ALSO: Breaking News: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ..

ఆస్కార్ విజేత చంద్రబోస్ పదునైన సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన మాస్ బీట్స్‌తో అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు. ఈ సాంగ్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మార్చ్ 26న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటేంట్‌తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా రీలీజ్ అయిన ఈ మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్లే అనే సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ వెండి తెరపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

READ ALSO: Quick Dinner Recipes: వంట రాని బ్యాచ్‌లర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు.. సింపుల్ ‘ఎగ్ ఫ్రైడ్ రైస్’ ఇలా చేసుకోండి!

Exit mobile version