Auqib Nabi Creates History in Duleep Trophy: జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దులీప్ ట్రోఫీ 2025లో నార్త్ జోన్‌కు ఆడుతున్న నబీ.. వెస్ట్ జోన్‌పై వరుస బంతుల్లో 4 వికెట్స్ తీశాడు. ఓ బౌలర్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టడం దులీప్ ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు మాజీలు కపిల్ దేవ్, సాయిరాజ్ బహుతులే తర్వాత దులీప్ ట్రోఫీలో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. నబీకి దులీప్ ట్రోఫీలో ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం.
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన 28 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరుగుతున్న నార్త్ జోన్, ఈస్ట్ జోన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా 4 వికెట్లు పడగొట్టాడు. రెండోరోజు 53వ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. విరాట్ సింగ్, మనీషి, ముఖ్తార్ హుస్సేన్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. తరువాతి ఓవర్ మొదటి బంతికే సూరజ్ సింధు జైస్వాల్ వికెట్ తీసి.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బౌలర్‌గా కూడా నిలిచాడు. చివరగా మహమ్మద్ షమీని అవుట్ చేసి ఐదవ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఆకిబ్ నబీ ధాటికి ఈస్ట్ జోన్ స్వల్ప వ్యవధిలో 7 పరుగులకు చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ సింగ్ (69) ఉత్కర్ష్ సింగ్ (38), కెప్టెన్ రియాన్ పరాగ్ (39), కుమార్ కుషాగ్రా (29) రాణించారు. అంతకుముందు నార్త్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (63), కన్హయ్య (76) హాఫ్ సెంచరీలు చేశారు. మనీషి 6 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Kathireddy Pedda Reddy: త్వరలో తాడిపత్రి వెళ్తా.. ప్రజలకు అందుబాటులో ఉంటా!
హ్యాట్రిక్ జాబితా:
1) కపిల్ దేవ్ – నార్త్ జోన్ vs వెస్ట్ జోన్, 1978
2) సాయిరాజ్ బహుతులే – వెస్ట్ జోన్ vs ఈస్ట్ జోన్, 2001
3) ఔకిబ్ నబీ – నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్, 2025
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల జాబితా:
1) ఎస్ఎస్ సైనీ – ఢిల్లీ vs హిమాచల్ ప్రదేశ్, 1988-89
2) మహమ్మద్ ముధాసిర్ – జమ్మూ & కాశ్మీర్ vs రాజస్థాన్, 2018-19
3) కుల్వంత్ ఖేజ్రోలియా – మధ్యప్రదేశ్ vs బరోడా, 2023-24
4) ఔకిబ్ నబీ – నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్, 2025-26
