Site icon NTV Telugu

Tariff Strategy Backfiring: అమెరికాకు సుంకాల సెగ.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆ రెండు దేశాలు!

F 35

F 35

Tariff Strategy Backfiring: అగ్రరాజ్యంకు సుంకాల సెగ తలిగిందా.. స్విట్జర్లాండ్, థాయిలాండ్ తీసుకున్న నిర్ణయానికి కారణం యూఎస్ నిర్ణయాల ఫలితమేనా? ప్రపంచంపై సుంకాల పడగ విప్పిన అమెరికాకు ఇప్పుడే అదే పడగ మెడకు చుట్టుకోనుందా.. ఈ ప్రశ్నలన్నింటికి విశ్లేషకులు అవుననే సమాధానలు చెప్తున్నారు.

READ MORE: Updated Income Tax Bill: ఆగస్టు 11న అప్డేటెడ్ బిల్లు.. ప్రయోజనాలు తెలుసా!

సుంకాలే కారణం అయ్యాయా..
స్విట్జర్లాండ్, థాయిలాండ్లు అమెరికన్ ఫైటర్ జెట్ల కొనుగోలు నుంచి వైదొలగడానికి కారణం ట్రంప్ విధానాలు, సుంకాల ఫలితం అని చర్చనడుస్తుంది. స్విట్జర్లాండ్ తన $9.1 బిలియన్ల F-35 విమానాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని పరిశీలిస్తుండగా, థాయిలాండ్ అమెరికన్ F-16 విమానాలను తిరస్కరించి స్వీడిష్ గ్రిపెన్ విమానాల కోసం $600 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అమెరికన్ కంపెనీ లాకోడ్ మార్టిన్ నుంచి 36 F-35 యుద్ధ విమానాల కొనుగోలు కోసం స్విట్జర్లాండ్ $9.1 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. కానీ ఇప్పుడు అక్కడి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాట్లాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌పై విధించిన 39% భారీ సుంకమే అని సమాచారం. ఈ భారీ సుంకాలు స్విస్ నుంచి అమెరికాకు ఎగుమతులైన గడియారాలు, కాఫీ క్యాప్సూల్స్‌పై విధించబడ్డాయి. ఈ నిర్ణయం ఆ దేశ ప్రజలు, నాయకులను ఆగ్రహానికి గురిచేసింది. అమెరికా వాణిజ్యంలో దేశానికి నష్టం చేస్తుంది.. అందుకే ఆ దేశం నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలనే ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు థాయిలాండ్ అమెరికా ఆయుధాల నుంచి దూరమై స్వీడిష్ సాంకేతికత వైపు కదులుతుంది. థాయిలాండ్ అమెరికన్ F-16 విమానాలను తిరస్కరించిన తర్వాత 4 స్వీడిష్ గ్రిపెన్ ఫైటర్ జెట్ల కోసం $600 మిలియన్ల ఒప్పందాన్ని ఖరారు చేసింది.

రెండు దేశాల నిర్ణయాల వెనుక కారణాలు…
అమెరికా విధించిన భారీ పన్నులు స్విట్జర్లాండ్, థాయిలాండ్ వంటి దేశాలను ఆగ్రహానికి గురిచేశాయి. ఇది వారి వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు వారు అమెరికా ఒప్పందాలను ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ విధానాలు, అమెరికాతో సంబంధాలలో ఉద్రిక్తత ఈ దేశాలను ఆలోచించేలా చేశాయి. అందుకే వారు అమెరికన్ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే నిర్ణయం వైపుచూసేలా చేశాయి. ఈ నిర్ణయాలు అంతర్జాతీయ రక్షణ మరియు వాణిజ్యంలో ఒక పెద్ద మార్పును సూచిస్తాయి. స్విట్జర్లాండ్ F-35 ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే, అమెరికన్ కంపెనీలు నష్టపోతాయి. అదే సమయంలో, థాయిలాండ్ గ్రిపెన్‌ను ఎంచుకోవడం వల్ల స్వీడన్ వంటి దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. చిన్న దేశాలు ఇప్పుడు అమెరికా ఒత్తిడితో కాకుండా తమ స్వేచ్ఛ, విశ్వాసం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాయని ఈ నిర్ణయాలతో స్పష్టంగా తెలుస్తుంది.

READ MORE: ChatGPT : చాట్‌జీపీటీ-5 తో మాట్లాడగలరా? వినగలరా?.. ఇది ఇక సాధ్యమే.!

Exit mobile version