NTV Telugu Site icon

Audimulapu Suresh : రెండో విడత మరిన్ని ఈ-ఆటోలు పంపిణీ చేస్తాం

Adimulapu Suresh

Adimulapu Suresh

చిన్న మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించాలని సీఎం జగన్ ఈ ఆటోలు ప్రారంభించారని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ’36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటీ రూ. 4.10 లక్షల విలువ చేసే 500 కేజీల సామర్థ్యం గల 516 ఈ- ఆటోలను పంపిణీ చేశాం. రెండో విడత మరిన్ని ఈ ఆటోలు పంపిణీ చేస్తాం. ఇప్పటికే రూ. 72 కోట్ల వ్యయంతో 123 మున్సిపాలిటీలోని చెత్త సేకరణకు ఏర్పాట్లు చేశాం. 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో 120 లక్షల చెత్తబుట్టల పంపిణీ చేశాం. గ్రేడ్-1 ఆపై మున్సిపాల్టీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్భేజ్ టిప్పర్ల వినియోగం జరుగుతోంది. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టుల ప్రారంభం అయ్యాయి.

Also Read : RBI : 1000 రూపాయల నోటు మళ్లీ వస్తుందా? ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారు?

త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. రూ. 157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గారేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. ప్రభుత్వం 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టూ కంపోస్ట్, 4 బయో మిథనైజేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ. 1,445 కోట్లతో 206 ఎస్టీపీల ఏర్పాటు చేశాం. లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీలలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (FSTP) ఏర్పాటు చేశాం. మున్సిపాల్టీల్లో పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేశాం. “ఈ- ఆటోల” డ్రైవర్లుగా 80 నుంచి 100 మహిళలకు అవకాశం ఇస్తున్నాం. ఎంఐజి, టిడ్కో లే అవుట్లు త్వరితగతిన పూర్తి చేస్తాం. ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తాం. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా పనులు పూర్తి చేస్తాం. రేపు గుడివాడలో సీఎం జగన్ అన్ని సౌకర్యాలతో టిడ్కో ఇళ్లు ప్రారంభించనున్నారు. గతంలోనే అన్ని సౌకర్యాలు చంద్రబాబు కల్పించి వుంటే లబ్బిదారులు టిడ్కో ఇళ్లలో చేరేవారు కదా? టిడ్కో ఇళ్లు 2.62 లక్షల ఇళ్లు పూర్తి లక్ష్యంగా పనులు చేస్తున్నాం.’ అని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

Also Read : Ancient Sculpture Found : పోలాకిలో లభించిన పురాతన శిల్పం