Site icon NTV Telugu

Audi A4 Signature Edition: ప్రీమియం ఫీచర్లతో ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ విడుదల.. 241KM వేగంతో దూసుకెళ్తుంది

Audi A4 Signature Edition

Audi A4 Signature Edition

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన ప్రసిద్ధ సెడాన్ ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది భారత్ లో రూ. 57.11 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు. ఇందులో 360 డిగ్రీల కెమెరాతో పార్క్ అసిస్ట్, కొత్త వుడ్ ఓక్ డెకరేటివ్ ఇన్లే (సహజ బూడిద రంగు ముగింపు), ప్రీమియం క్యాబిన్ ఫీల్, ఆడి రింగ్స్ ఎంట్రీ LED ల్యాంప్స్, అద్భుతమైన వెల్కమ్ లైట్, ఆడి రింగ్స్ డెకాల్స్, డైనమిక్ వీల్ హబ్ క్యాప్స్, ప్రీమియం సువాసన డిస్పెన్సర్, ఏరోడైనమిక్ స్పాయిలర్ లిప్, స్పోర్టీ ప్రొఫైల్, కస్టమ్ కలర్ కీ, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్, ఇంటీరియర్‌కు స్పోర్టీ టోన్ ఇవ్వడం, స్పెషల్ అల్లాయ్ వీల్ పెయింట్ డిజైన్, ఎక్స్‌టీరియర్‌కు బోల్డ్ లుక్ ఇవ్వడం వంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

Also Read:Kannappa : పిలక, గిలక పాత్రలపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు..

ఇది 19 స్పీకర్లతో కూడిన B&O 3D ప్రీమియం సౌండ్ సిస్టమ్, 25.65 సెం.మీ హై-రిజల్యూషన్ స్క్రీన్, వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, నావిగేషన్, వాయిస్ కంట్రోల్, ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. దీనితో పాటు, 30 కలర్ ఆప్షన్‌లతో యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, జెస్టర్ బేస్డ్ బూట్ ఓపెనింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన ఆడి ఫోన్ బాక్స్, డ్రైవర్ సీటుకు మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ సీట్లు అందించారు.

Also Read:Sharmistha Panoli: శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అరెస్టు

ఇది గ్లేసియర్ వైట్ మెటాలిక్, మైథోస్ బ్లాక్ మెటాలిక్, నవర్రా బ్లూ మెటాలిక్, ప్రోగ్రెసివ్ రెడ్ మెటాలిక్, మాన్‌హట్టన్ గ్రే మెటాలిక్ అనే 5 అద్భుతమైన కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇది 2.0L TFSI పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 204 hp శక్తిని, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తమ కారు కేవలం 7.1 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 241 కి.మీ.

Exit mobile version