అప్పు చేసి తీర్చనందుకు చంపేందుకు కూడా వెనకాడలేదు ఓ వ్యక్తి. ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్న వ్యక్తిని అప్పు తీర్చలేడన్న కోపంతో అంతమొందించేందుకు పూనుకున్నాడు. ఈ దారుణం చంద్రగిరిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. సరవణ అనే వ్యక్తి అన్వర్ అనే వ్యక్తితో ఆటో అద్దెకు తీసుకుని తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో డ్రైవర్ సరవణను ఓనర్ తో అప్పు చేశాడు. అప్పు చెల్లించలేదని ఆటో డ్రైవర్ సరవణను గదిలో నిర్బంధించిన ఆటో ఓనర్ అన్వర్ అతడి స్నేహితులతో కలిసి చితక బాదాడు. అంతే కాకుండా సరవణను కింద పడేసి ఆటోతో తొక్కించాడు.. అన్వర్.
READ MORE: Botsa Satyanarayana: చంద్రబాబులాగా మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యం..
అతడు మృతి చెందాడనుకొని అక్కడ నుంచి సరవణ బాడీని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశాడు. ఈ ఘటనలో ఓనర్ అన్వర్ తో పాటు అతని స్నేహితులు హర్ష, అబ్బు కూడా ఉన్నారు. రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన ఆటో డ్రైవర్ సరవణ కేకలు వేయడంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు గుర్తించారు. పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని 108లో రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సరవణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.