NTV Telugu Site icon

S. Jaishankar: కిర్గిజిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై దాడులు.. స్పందించిన భారత విదేశాంగ మంత్రి

New Project (14)

New Project (14)

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో స్థానిక, విదేశీ విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కిర్గిస్థాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. మే 13న కిర్గిజ్ విద్యార్థులు, ఈజిప్టు వైద్య విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. దీంతో ఈ సమస్య తీవ్రమైంది. స్థానిక విద్యార్థులు, విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం తమ విద్యార్థులకు సలహా జారీ చేసింది. కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా.. ఇలా రాసింది. ‘మేము మా విద్యార్థులతో టచ్‌లో ఉన్నాము. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎంబసీని సంప్రదించాలి. 24×7 నంబర్ 0555710041ను సంప్రదించాలి.” అని రాసుకొచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాశారు. ‘బిష్కెక్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితిని నేను పర్యవేక్షిస్తున్నాను. ఇప్పుడు అక్కడ శాంతి నెలకొంది. విద్యార్థులు ఎంబసీతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలి.” అని పేర్కొన్నారు.

READ MORE: Israel Gaza War : ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన హిజ్బుల్లా.. దాడిలో కొత్త ఆయుధం

కిర్గిజ్ మీడియా నివేదికల ప్రకారం.. బిష్కెక్‌లోని కొన్ని వైద్య విద్యా సంస్థల హాస్టళ్లు, పాకిస్థాన్‌తో సహా ఇతర దేశాల విద్యార్థుల ప్రైవేట్ నివాసాలపై దాడులు జరిగాయి. భారతదేశం, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులు హాస్టళ్లలో నివసిస్తుంటారు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు విద్యార్థినులను కిర్గిజ్ విద్యార్థులు వేధించిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తన దేశ విద్యార్థులపై జరిగిన దాడిని ఎక్స్‌లో పోస్ట్‌లో ధృవీకరించారు. “కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్‌కెక్‌లో పాకిస్థానీ విద్యార్థులకు జరిగిన సంఘటన పట్ల నేను ఆందోళన చెందుతున్నాను. అవసరమైన సహాయాన్ని అందించాల్సిందిగా పాక్ రాయబారిని ఆదేశించాను. నా కార్యాలయం కూడా ఎంబసీతో టచ్‌లో ఉంది.” అని రాసుకొచ్చారు.

Show comments