Crime: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీవో కార్యాలయం సమీపంలో మారణాయుధాలతో దాడి చేసిన ఘటన జరిగింది. ఈ దాడి ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక యువకుని పరిస్థితి విషమంగా ఉంది. ఆరిఫ్ (19) అనే యువకుడికి కడుపులో బలమైన గాయం కావడంతో పేగులు బయటకు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది. .ఆఫ్రోజ్ (25) తలకు, అతని స్నేహితుడు సయ్యద్ (19) చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ముగ్గురిని విజయవాడ తరలించారు.
Read Also: BC Janardhan Reddy: నందవరం చౌడేశ్వరి దేవి ఆశీస్సులు తీసుకున్న బీసీ దంపతులు
పట్టణానికి చెందిన జ్యోతిష్యుడు సీహెచ్ రమేష్ ఆచార్యులు, మస్జిద్ మౌజన్ ఉస్మాన్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా రమేష్ ఆచార్యులు, ఉస్మాన్‌ల మధ్య స్నేహం కొనసాగుతోంది. రాత్రి మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ దాడి ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.