NTV Telugu Site icon

MIM Corporator Nephew Died: పాతబస్తీలో దారుణం.. MIM కార్పొరేటర్ మేనల్లుడి మృతి

lalitha bagh mim

133

పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఎంఐఎం కార్పొరేటర్ ఆజం మేనల్లుడు సయ్యద్ ముర్తూజా అనాస్ మృతిచెందాడు. లలితాబాగ్ లోని కార్పోరేటర్ కార్యాలయం బయట సయ్యద్ ముర్తూజా పై దాడి జరిగింది. కార్యాలయం లోపలికి వెళ్ళి కుప్పకూలిపోయాడు సయ్యద్. దాడిలో తీవ్రంగా గాయపడిన ముర్తుజాను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతి చెందాడు సయ్యద్ ముర్తుజా. సయ్యద్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. మృతుడు సయ్యద్ ముర్తుజా అన్వర్ ఉలుం కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సయ్యద్ హత్య కేసులో నిందితుల కోసం గాలింపు జరుగుతోంది. మొత్తం ఐదు టీమ్ ల ఏర్పాటు చేశారు. సయ్యద్ ముర్తూజా హత్యకు గల కారణాలు ఇంకా తెలియదంటున్నారు పోలీసులు. సయ్యద్ ముర్తూజాపై హత్యాయత్నానికి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు. కార్పేరేటర్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి.. కత్తులతో దాడి చేశారని తెలిపారు. కార్పొరేటర్ మేనల్లుడు సయ్యద్ ముర్తూజా తీవ్ర గాయలపాలయ్యాడు… ఒవైసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కార్పొరేటర్ మేనల్లుడు లక్ష్యంగా దాడి చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.

Read Also:Elon Musk: ఎలాన్ మస్క్‌కు యూజర్ల షాక్.. ట్విట్టర్ సీఈఓగా దిగిపోవాలని ఓటింగ్

దాడి చేసిన వాళ్ళు కూడా నలభై ఏళ్ళ వయస్సు ఉన్నవారుగా గుర్తించామన్నారు. ఈ హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ సేకరించాం.. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించాం. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు ఏసీపీ శ్రీనివాసరెడ్డి. నిందితులను పట్టుకునేందుకు ఐదు టీమ్ ల ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉంటే.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు వున్నారని తెలుస్తోంది. ఈ ఘటన పాతబస్తీ లలితాబాగ్ లో కలకలం రేపింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరిస్థితి అదుపులోనే వుందని పోలీసులు తెలిపారు.

Read ALso: Moonlighting: “మూన్‌లైటింగ్”పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. టెక్కీలకు షాక్..