Site icon NTV Telugu

Shraddha Case: ఆఫ్తాబ్‎ను వాహనంలో తరలిస్తుండగా కత్తులతో దాడి

Sradda

Sradda

Shraddha Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలపై కత్తులతో దాడి జరిగింది. ఢిల్లీలోని రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీలో రెండో విడత పాలీగ్రాఫ్​పరీక్ష ముగిసిన తర్వాత.. ఆఫ్తాబ్​ను తరలిస్తున్న పోలీస్​వ్యాన్​పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఆఫ్తాబ్​ను జైలుకు తరలిస్తున్న సమయంలో కత్తులతో వచ్చి అతడిని చంపేందుకు యత్నించారు. పోలీసు వ్యాన్‌ను బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డుకుని ఆపడానికి కూడా ట్రై చేశారు. అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్‌ హత్య కేసులో పోలీసులు మరికొంత పురోగతి సాధించారు.

Read Also: Hacking : ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాక్.. రూ.200కోట్లు డిమాండ్

శ్రద్ధావాకర్‌ మృతదేహాన్ని 35ముక్కలుగా కోసేందుకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. శ్రద్ధ ఉంగరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్తాబ్‌.. శ్రద్ధా ఉంగరాన్ని తనతో డేటింగ్‌ చేస్తున్న మరో యువతికి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. తనతో సహజీవనం చేసిన శ్రద్ధా వాల్కర్‌ని.. అఫ్తాబ్ వాల్కర్‌ని అతి కిరాతకంగా హత్య చేశాడు. 35 ముక్కలుగా చేసి.. ఫ్రిజ్‌లో పెట్టి.. ఆపై వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. అయితే ఆరు నెలల తర్వాత ఈ విషయం బయటకొచ్చింది. శ్రద్ధ వాకర్ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయడంతో.. మొత్తం విషయం బయటకొచ్చింది. వెంటనే అఫ్తాబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో కూడా అఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు.

Exit mobile version