Site icon NTV Telugu

Uttar Pradesh: యూపీలో దారుణం.. సోదరి తలతో రోడ్డుపైకి..!

Murder

Murder

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరిని అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తలను చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అది చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ యువకుడి కోసం వెతుకులాట ప్రారంభించగా.. దారిలో పోలీసుల కంటబడ్డాడు. దీంతో ఆ యువకుడు.. తాను లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తున్నానని పోలీసులకు తెలిపాడు.

Mamata Banerjee Home: ఆయుధాలతో మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నం.. నిందితుడు అరెస్ట్

అసలు విషయానికొస్తే.. ఈ షాకింగ్ ఘటన ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్వారా గ్రామంలో జరిగింది. రియాజ్ అనే వ్యక్తి తన సోదరి ఆషిఫాతో ఏదో విషయమై వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రియాజ్ ఇంట్లోని కత్తితో ఆషిఫా తల నరికాడు. ఆ తర్వాత రియాజ్ ఆ తలను తీసుకుని ధైర్యంగా రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుపై సుమారు కిలోమీటరు మేర అందరూ చూస్తుండగానే.. నడుచుకుంటూ వెళ్లాడు. అయితే అతన్ని చూసిన జనాలు అతడిని పట్టుకునేందుకు సాహసించలేదు.

MP Arvind: బీజేపీని వాడుకుని వెళ్లిపోతే.. వాళ్లను జుట్టు పట్టుకుని లాక్కొస్తాం..

అయితే గ్రామానికి చెందిన చాంద్‌బాబు అనే వ్యక్తితో ఆషిఫాకు అక్రమ సంబంధం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. చాంద్ బాబును పెళ్లి చేసుకోవద్దని ఆషిఫాకు రియాజ్ పదే పదే చెప్పాడు.. అయినా ఆమే వినలేదు. దీంతో కోపాద్రిక్తుడైన రియాజ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version