NTV Telugu Site icon

RK Beach : ఆర్కేబీచ్‎లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం

Whatsapp Image 2023 04 26 At 10.35.38 Am

Whatsapp Image 2023 04 26 At 10.35.38 Am

RK Beach : విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పెద గంట్యాడ కు చెందిన శ్వేత గా గుర్తించారు. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇటీవల న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లో యువతి మిస్సింగ్ కేసు నమోదైంది. ఇంతలోనే మృతదేహం లభ్యమవ్వడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. యువతి చనిపోయిన తర్వాత అర్ధరాత్రి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో యువతి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Bomb Threat: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు

ఇది ఇలా ఉండగా.. మంగళవారం విశాఖ ఆర్కే బీచ్ లో దూకి యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన బీచ్ లైఫ్ గార్డ్స్ ధనరాజు, ఎర్ని రాజు తక్షణం స్పందించి అతడిని రక్షించారు. ఆనారోగ్యం కారణంగానే.. సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యాక యత్నించినట్లు సమాచారం. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి బొబ్బిలికి చెందిన సాయి కుమార్ గా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని లైఫ్ గార్డ్స్ మహారాణిపేట పోలీసులకు అప్పగించారు.

Read Also:Electric Car: చౌకైన చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే..

Show comments