Physical Harassment: అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం

  • అన్నమయ్య జిల్లాలో దారుణం
  • మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం
  • వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం దూళ్ళ హరిజనవాడలో ఘటన
  • ఈ విషయాన్ని చెబితే పట్టించుకోని పోలీసులు
  • మనస్థాపంతో సూపర్ వాస్మైల్ తాగి ఆత్మహత్యాయత్నం.
Gangrape

Gangrape

రోజు రోజుకు సమాజంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ఇలాంటి వాటికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు అసలు పట్టించుకోవడం లేదు. రోజుకు ఎక్కడో చోట ఈ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏపీలో ఓ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం దూళ్ళ హరిజనవాడలో జరిగింది.

Read Also: Amazon Prime Day : భారీ డిస్కౌంట్లు అందించేందుకు అమెజాన్ రెడీ.. మరి కొనేందుకు మీరు రెడీనా..

స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డయ్య అనే వ్యక్తి బాత్రూంలో దూరి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడంటూ బాధితురాలు ఆరోపిస్తుంది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో అక్కడ నుండి నిందితుడు పరారయ్యాడు. ఈ క్రమంలో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ వీరబల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే.. న్యాయం చేయాల్సిన పోలీసులే.. పట్టించుకోకపోగా, అంతేకాకుండా.. ఎస్సై ప్రవర్తించిన తీరుపై మనస్థాపానికి గురై బాధితురాలు ఆత్మహత్యయత్నానికి యత్నించింది. సూపర్ వాస్మైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో.. కుటుంబ సభ్యులు ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Read Also: AP NEWS: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త ఇసుక పాలసీ