Atlee : అల్లుఅర్జున్ పై ఇష్టం ఆ విధంగా చూపించిన దర్శకుడు అట్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ దర్శకుడు తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ విధంగా డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాభారీ గా కలెక్షన్లను సాధించి సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా మంచి సక్సెస్ కావడంతో అట్లీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎంతో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని అట్లీ తెలిపారు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం, పుష్ప సినిమాలు తనకు ఎంత గానో నచ్చాయని ఈ సినిమాలను తరచూ చూస్తూ ఉంటానని అట్లీ వెల్లడించారు. అయితే ఈ రెండు సినిమాలను తాను షారుక్ ఖాన్ కి కూడా చూపించాను అంటూ ఈ సందర్భంగా అట్లీ తెలిపారు. జవాన్ షూటింగ్ సమయంలోనే షారుఖ్ ఖాన్ గారికి ఈ రెండు సినిమాలను తాను చూపించాను అంటూ అట్లీ వెల్లడించారు. ఇలా తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ సినిమాలను తరచు చూస్తూ ఉంటానని ఈయన చెప్పడంతో అల్లు అర్జున్ ఫాన్స్ ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జవాన్ సినిమా భారీ సక్సెస్ కావడంతో డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత ఈయన తన తరువాత చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. మరి అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి వుంది.
Also Read
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Tags
- alluarjun
- Atlee
- jawan
- Sharukh Khan
తాజావార్తలు
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా అనుపమ్ ఖేర్!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!