Site icon NTV Telugu

Atlee : స్పెషల్ పోస్ట్‌తో.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ అట్లీ

Atle

Atle

సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ. తాజాగా తన ఇంట్లో త్వరలోనే పండంటి బిడ్డ అడుగుపెట్టబోతున్నాడు. అట్లీ భార్య ప్రియ మరోసారి గర్భం దాల్చారు. ఈ విషయాన్ని అట్లీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.. ‘మా చిన్నారి గూటికి కొత్త సభ్యుడు రాబోతున్నాడు.. అవును, మేమిద్దరం మళ్ళీ తల్లిదండ్రులం కాబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబం మరింత పెద్దది కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నామని, ఈ మధుర క్షణాల్లో అభిమానులందరి ప్రేమ, ఆశీస్సులు తమకు ఉండాలని అట్లీ కోరారు.

Also Read : Isha Rebba : “అంగుళం అంగుళం జూమ్ చేసి చూశారు”.. స్టార్ డైరెక్టర్ పై ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్..!

అట్లీ, ప్రియ దంపతులకు ఇప్పటికే ‘మీర్’ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో బిడ్డ రాకతో వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అట్లీ షేర్ చేసిన ఈ పోస్ట్‌లో తన భార్య, కుమారుడు వారి పెంపుడు జంతువుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ‘ఫ్యామిలీ గోల్స్’ ఇచ్చారు. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సెలబ్రిటీల‌తో పాటు అభిమానులు అట్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అట్లీ తన తదుపరి భారీ ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతుండగా, ఈ శుభవార్త ఆయన ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది.

 

Exit mobile version