Site icon NTV Telugu

Atharva : ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 01 16 At 10.12.12 Am

Whatsapp Image 2024 01 16 At 10.12.12 Am

లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించారు.అయితే ఈ చిత్రానికి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అథర్వ చిత్రంలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కార్తిక్ రాజు మరియు సిమ్రన్ చౌదరి పర్ఫార్మెన్స్ ప్లస్ అయ్యాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్టుగా ఉంటుంది. అలాగే చరణ్ సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది.ఇదిలా ఉంటే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని అథర్వ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.అథర్వ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ నేడు (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్‍ డేట్‍ను వెల్లడించింది.

”ఈ టీవీ విన్ సబ్‍స్క్రైబర్లకు సంక్రాంతి గిఫ్ట్ వచ్చేస్తుంది. మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీమ్‍లోని బయోమెట్రిక్ అనలిస్ట్ ప్రయత్నిస్తారు. ఇన్వెస్టిగేషన్ సంక్లిష్టంగా మారుతుంది. మరి మిస్టరీని అతడు ఛేదించగలిగాడా” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది. అలాగే, జనవరి 18న అథర్వ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.ఈ చిత్ర కథ విషయానికి వస్తే..దేవ అథర్వ కర్ణ (కార్తిక్ రాజు) పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే, అతడికి ఆస్థమా ఉండడంతో అది సాధ్యం కాదు. దీంతో పోలీస్ శాఖలోనే క్లూస్ టీమ్‍లో జాయిన్ అవొచ్చని ఓ వ్యక్తి సలహా ఇవ్వడంతో ఆ దిశగా అతడు ప్రయత్నాలు చేస్తాడు. మొత్తంగా క్లూస్ టీమ్‍లో ఉద్యోగం సాధిస్తాడు. తన తెలివితో చాలా కేసులను అథర్వ అలియాజ్ కర్ణ పరిష్కరిస్తాడు.. అథర్వ ఓ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన చిక్కులు, సవాళ్లు ఏంటి..అనేది ఈ చిత్ర కథ..థియేటర్స్ లో అంతగా మెప్పించని అథర్వ ఓటీటీ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version