కార్తీక్ రాజు మరియు సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన అథర్వ గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అయింది.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగుతుంది.ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి..థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్ లో జనవరి 18 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది..ఓటీటీ ప్రేక్షకులను కూడా ఈ మూవీ ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఇక ఇప్పుడు అథర్వ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అథర్వ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది.. మరి ఇక్కడి ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా అథర్వ ఆకట్టుకునేలా ఉంది. అథర్వ సినిమా అటు థియేటర్ ఆడియెన్స్ తో పాటు ఇటు ఓటీటీ లవర్స్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. దేవ అథర్వ కర్ణ (కార్తిక్ రాజు) పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అతడికి ఆస్థమా ఉండడంతో అది సాధ్యం కాదు. దీంతో పోలీస్ శాఖలోనే క్లూస్ టీంలో జాయిన్ కావొచ్చని ఓ వ్యక్తి సలహా ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు అదే టీంలో ఉద్యోగం సాధిస్తాడు. తన తెలివితో చాలా కేసులను పరిష్కరిస్తాడు. అథర్వ ఓ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన చిక్కులు, సవాళ్లు ఏంటీ అనేది ఈ చిత్ర కథ..ఇంత వరకు ఎన్నో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లను చూసిన ఆడియెన్స్‌కు ఈ అథర్వ మూవీ కొత్త ఫీలింగ్ ను ఇచ్చింది. క్లూస్ టీం పడే కష్టాన్ని ఈ సినిమాలో చూపించారు.
