NTV Telugu Site icon

T20 Womens World Cup: ఆతిథ్య సౌతాఫ్రికాకు షాక్..శ్రీలంక సూపర్ విక్టరీ

7

7

మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సౌతాఫ్రికా జట్టుకు శ్రీలంక గట్టి షాకిచ్చింది. శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లంక జట్టు 3 పరుగుల తేడాతో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాను ఓడించి సంచలనం నమోదు చేసిది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ ఆటపట్టు(68) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. విష్మీ గుణరత్నే(35) పర్వాలేదనిపించింది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్, నదినే డి క్లర్క్ చెరో వికెట్ తీసారు.

Also Read: Hansika: ఈ హీరోయిన్ తన ఫ్రెండ్ భర్తనే లాగేసుకుందా?

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. శ్రీలంక స్పిన్ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లంక బౌలర్లు చెలరేగడంతో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దాంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. సఫారీ బ్యాటర్లు 9 పరుగులు మాత్రమే చేసి ఓటమికి తలవంచారు. కెప్టెన్ సున్ లూస్(28), ఓపెనర్ లౌరా వోల్వార్డట్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి(2/28), రణసింఘే(2/20) రెండేసి వికెట్లు తీయగా.. రణవీర(3/18) మూడు వికెట్లతో ఆకట్టుకుంది.

Also Read: Akash Chopra: ముందు మీ దేశంలో సిరీస్ గెలవండి: పాక్ ఫ్యాన్స్‌కు ఆకాశ్ చోప్రా పంచ్