Akash Chopra: ముందు మీ దేశంలో సిరీస్ గెలవండి: పాక్ ఫ్యాన్స్‌కు ఆకాశ్ చోప్రా పంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో టీమిండియాను ఓడించడం అంత తేలిక కాదన్న విషయం తెలిసిందే. టాప్ క్రికెట్ దేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఇలా ప్రతి జట్టుకు ఇండియాను సొంతగడ్డపై ఓడించడం అనేది కలగానే మిగిలిపోతోంది. ఇక టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టే.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించేందుకు 19 ఏళ్లుగా శ్రమిస్తోంది. అప్పుడెప్పుడో 2004లో చివరి సారిగా గెలిచిన ఆసీస్.. ఈ సారి ఆ ముచ్చట తీర్చుకోవాలనే కసితో ఉంది. విదేశాల్లో మన ప్రదర్శన ఎలా ఉన్నా స్వదేశంలో భారత్‌ను ఓడించడం అనేది శక్తికి మించిన పని. అయితే ఈ అగ్రదేశాల వల్ల కాని పనిని పాకిస్తాన్ చేస్తుందని, సొంతగడ్డపై భారత్‌ను ఓడించే సత్తా పాక్‌కే ఉందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. కాగా దీనికి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Also Read: Murali Vijay: దక్షిణాది క్రికెటర్స్ అంటే ఎందుకు వివక్ష: మంజ్రేకర్‌కు విజయ్ కౌంటర్
Also Read
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ట్విట్టర్ వేదికగా ఓ ఒపినీయన్ పోల్ పెట్టగా పాక్‌కు చెందిన ఓ అభిమాని “సొంతగడ్డపై టీమిండియాను ఓడించే సత్తా పాకిస్తాన్‌కు మాత్రమే ఉంది” అని బదులిచ్చాడు. ఈ రిప్లైకు స్పందించిన ఆకాశ్ చోప్రా అదిరిపోయే కౌంటరిచ్చాడు. “నీ పాజిటివ్ దృక్పథం చూస్తుంటే ముచ్చటేస్తుంది బ్రదర్.. కానీ నువ్వు అసలు విషయం మరిచిపోయినట్టున్నావ్. ముందు పాక్‌ను సొంతగడ్డపై సిరీస్ గెలవమను. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే పాక్ ఓటమిపాలైంది. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ చేతిలోనూ చిత్తయ్యింది. ఈ సిరీస్‌ల్లో మీరు గెలిచుంటే ఇప్పటికే పాకిస్తాన్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరేది” అని వరుస ట్వీట్లు చేశాడు. దాంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చోప్రా ఇచ్చిన కౌంటర్‌కు భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘అవును చోప్రా భయ్యా.. కరెక్ట్‌గా చెప్పారు.. విదేశీ జట్లు వాళ్ల దేశానికి వస్తే సిమెంట్ రోడ్లున్న పిచ్‌లను తయారుచేసి అబాసు పాలవుతున్న పాకిస్తాన్ మనకు నీతులు చెబుతోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
I love your positivity but janaab, aap Apne ghar ki series toh Jeet lo. With Australia, England and NZ at home. Bangladesh, Sri Lanka and WI in away series, Pakistan should have reached the WTC finals already. 🫣🫂 https://t.co/UEo67hQYU9
— Aakash Chopra (@cricketaakash) February 9, 2023
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!