పేదల ద్రోహి జగన్‌కి ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధం అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తన అవలక్షణాలు ఎదుటి వారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం.. నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి కంటికి వైసీపీ ప్రజా ప్రతినిధులు కనిపించ లేదు.. తాడేపల్లి ప్యాలెస్‌లోకి వారికి అనుమతి లేదు.. పంచాయతీల నిధులు రూ.8,600 కోట్లు దారి మళ్లింపును ప్రశ్నించిన వైసీపీ సర్పంచులపై లాఠీ ఛార్జీ చేయించారు అని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టారు.. ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు వైసీపీలోని స్థానిక ప్రజా ప్రతినిధులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు.. పేదలపై జగన్ రెడ్డిది కొంగ జపం.. పేదలపై చూపేది కపట ప్రేమ అని అచ్చెన్నాయుడు అన్నారు.
Read Also: Chennai: ఓ వ్యక్తి అకౌంట్కు రూ.2000 పంపితే రూ.753 కోట్లు జమ..
పేదలకు జగన్ రెడ్డి చేసింది నమ్మక ద్రోహం అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిని మించిన పెత్తందారు మరెవరూ లేరు.. పేదల ద్రోహి జగన్ రెడ్డి మాత్రమే.. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సొంత కాళ్లపై నిలబెట్టేందుకు ప్రవేశ పెట్టిన 120 సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధుల్ని రూ.1.14 లక్షల కోట్లను జగన్ రెడ్డి దారి మళ్లించారు అని ఆయన దుయ్యబాట్టారు. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కాజేస్తున్నారు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి 16,800 రాజ్యాంగబద్ద పదవుల్ని దూరం చేశారు.. బీసీ జనగణన తీర్మానంపై కేంద్రాన్ని కనీసం ప్రశ్నించకుండా ద్రోహం చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Read Also: Extraordinary Man :డిసెంబర్ బాక్సాఫీస్ క్లాష్లోకి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఆరోజే రిలీజ్
ఆదరణ పథకాన్ని రద్దు చేసి చేతి వృత్తుల వారిని దగా చేశారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తుల్ని కాజేశారు.. లక్ష బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా బడుగు బలహీన వర్గాలను దగా చేశారు.. కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది పేదల ఆరోగ్యం దెబ్బతిన్నది.. ఈ ద్రోహం కప్పిపుచ్చుకోవడానికి సురక్ష పేరుతో కపట నాటకానికి తెరలేపాడు అని ఆయన చెప్పుకొచ్చారు. మద్యం రేట్లు పెంచి పేదల సంపాదనలో అధిక భాగం తాడేపల్లి ప్యాలెస్ దోచుకుంటోంది.. ఉచిత ఇసుక రద్దు చేసి 125 కుల వృత్తులు వ్యాపారాలను దెబ్బతీశారు.. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు.. డీజిల్, పెట్రోల్ ధరలు, గ్రీన్ ట్యాక్స్ పెంచి లక్షలాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఉపాధి దెబ్బ తీశారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.