NTV Telugu Site icon

Atchannaidu: 2024లో పసుపు జెండా ఎగరేస్తాం

Atchannaidu

Atchannaidu

ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీని ఢీకొని ఉత్తరాంధ్ర, తూర్సు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాల్లో వేపాడ చిరంజీవి రావు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలకు జగన్ పాలన పట్ల ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతోందన్నారు ఏపీ టీడీపీ అధ్కక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. టీడీపీకి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా ఏకమై ఫ్యాన్ పార్టీకి పవర్ కట్ చేశారు.

Read Also:Bhumireddy Ramgopal Reddy: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విక్టరీ

వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కలసి.ఫ్యాన్ రెక్కల్ని ముక్కలు చేయడం ఖాయం. దేశంలో అదానీ సంస్ధ దివాళా తీసినట్టు రాష్ట్రంలో వైసీపీ దివాళా తీసింది. అబద్ధాలు, మోసాలతో ప్రజల్ని ఎన్నాళ్లు మాయ చేస్తారు ? లోకేశ్ పాదయాత్ర ప్రభంజనం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మొదలైంది. ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీకి పాడే కట్టి పసుపు జెండాను ఎగురవేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా ముందుకెళతామన్నారు టీడీపీ నేతలు.

Read Also:Facebook Love: నువ్వు లేనిదే నేను లేనన్నాడు.. ఎవరూ లేనిది చూసి వదిలేశాడు

Show comments