Site icon NTV Telugu

Naari Naari Naduma Murari : బాలయ్య ముహూర్తం.. భారీ పోటీలో బ్లాక్ బస్టర్ కొట్టిన శర్వానంద్

Sharwanandh

Sharwanandh

టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలకు సంబంధించిన విశేషాలు భలే ఆసక్తికరంగా మారుతుంటాయి. అలాంటి సంఘటన ఒకటి హీరో శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమాకు జరిగింది. శర్వా హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.  ఫెస్టివల్ సీజన్‌లో వచ్చిన చిత్రాల్లో చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా మారింది.

Also Read : Vijay Sethupathi : విజయ్ సేతుపతి.. సాయి పల్లవి.. మణిరత్నం భారీ ప్రాజెక్ట్

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 36 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ హీరోగా, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నారి నారి నడుమ మురారి’ అనే సినిమా విడుదలై అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే అదే టైటిల్‌ను శర్వానంద్ సినిమా కోసం ఫిక్స్ చేయగానే, అది బాలకృష్ణ సినిమా టైటిల్ కదా అని  ఆయన అనుమతి తీసుకోవాలని శర్వానంద్ స్వయంగా బాలకృష్ణకు ఫోన్ చేసి విషయం వివరించగా, “ఈ విషయం నాకెందుకు చెప్తున్నావు, నిరభ్యంతరంగా టైటిల్ పెట్టుకో” అంటూ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు, టైటిల్ పెట్టుకోమని చెప్పడమే కాకుండా  సినిమా షూటింగ్‌కు, టైటిల్ రివీల్ కు ముహూర్తం కూడా బాలకృష్ణ ఫిక్స్ చేశారట. ఇక భారీ సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయినా నారి నారి నడుమ మురారి శర్వా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ విషయాన్నీ బాలయ్యకు చెప్పేందుకు శర్వానంద్ మరోసారి కాల్ చేయగా “నా పేరు కాపాడావు… సినిమా సూపర్ హిట్ అయిందని తెలిసింది. ఇలానే రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చేయాలి” అంటూ శర్వానంద్‌ను దీవించారట బాలయ్య. ఆ సంతోషాన్ని తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ “ఇక నుంచి నా సినిమాలన్నింటికీ బాలయ్యతోనే ముహూర్తం పెట్టించుకుంటాను” అని అన్నారట. మొత్తానికి, బాలయ్య టైటిల్ తో ఆయన పెట్టిన ముహూర్తంతో శర్వానంద్‌కు భారీ హిట్ అందుకున్నాడు.

Exit mobile version