NTV Telugu Site icon

Kajal Aggarwal : ఆ సమయంలో కాజల్ అన్న మాటకు షాక్ అయిన దర్శకుడు తేజ..?

Whatsapp Image 2024 05 11 At 2.43.47 Pm

Whatsapp Image 2024 05 11 At 2.43.47 Pm

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.తాజాగా ఈ భామ నటిస్తున్న మూవీ “సత్యభామ”.ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంది.ఈ మూవీ మే 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అలీతో సరదాగా షో కు గెస్ట్ గా వచ్చింది.

Read Also : Satyabhama : కాజల్ “సత్య భామ” థర్డ్ సింగిల్ అప్డేట్ వైరల్..

ఆ షోలో కాజల్ తన మొదటి సినిమా ఆడిషన్ లో దర్శకుడు తేజకి షాక్ ఇచ్చిన సందర్భాన్ని బయటపెట్టింది.దర్శకుడు తేజ తన ఫోటో చూసి “లక్ష్మీ కళ్యాణం”సినిమాకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఫోటోలో తనని చూసి దర్శకుడు తేజ ఆడిషన్‌కి పిలిచారని కాజల్ తెలిపింది.ఆడిషన్ కి వెళ్లగా ఆడిషన్‌లో తనని ఏడవమని తేజ చెప్పారు. నా లైఫ్‌లో ఎలాంటి టెన్షన్, బాధ లేదు నేను ఎందుకు ఏడవాలి అని కాజల్ అనగా దర్శకుడు తేజ షాక్ అయ్యాడట. ఆ తర్వాత తన నాన్నతో తిట్టించుకుని మరీ ఏడిచిందట కాజల్‌.ఆ ఎక్స్ ప్రెషన్స్ చూసి తేజ ఫిదా అయ్యి ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా కాజల్ తెలిపింది.

Show comments