Site icon NTV Telugu

Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 39 మంది దుర్మరణం

Bus Crash

Bus Crash

Bus Crash in America: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో 39 మంది వలసదారులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనామాలో 60 మందికి పైగా వలసదారులతో ప్రయాణిస్తున్న బస్సు బుధవారం తెల్లవారుజామున కొండపై నుండి పడిపోవడంతో కనీసం 39 మంది మరణించారని ఆ దేశ మైగ్రేషన్ అధికారులు తెలిపారు. ఇది సెంట్రల్ అమెరికా దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన వలస ప్రమాదంగా గుర్తించబడింది. కొలంబియా నుంచి డేరియన్​ లైన్‌ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఓ శిబిరానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు.

INDW vs WIW: వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు

వలసదారులతో ఈ బస్సు కోస్టారికా సరిహద్దులో ఉన్న పశ్చిమ తీర ప్రావిన్స్ చిరికీలో ఉన్న ఆశ్రయం వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బస్సులోని 66 మంది ప్రయాణీకులలో సగానికి పైగా గ్వాలాకా వలసదారుల ఆశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 20 మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని, వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారని పనామా సామాజిక భద్రతా అథారిటీ వెల్లడించింది. మైగ్రేషన్ అధికారులు బాధితుల జాతీయతలపై వివరాలను అందించలేదు. మొదట ప్రయాణీకుల బంధువులు, సంబంధిత రాయబార కార్యాలయాలతో కమ్యూనికేట్ చేస్తుంది.

Exit mobile version