NTV Telugu Site icon

Guyana : స్కూల్ హాస్టల్​లో ప్రమాదం.. 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి

Fire News,

Fire News,

Guyana : దక్షిణ అమెరికా దేశం గయానాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల హాస్టల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. సంఘటన జరిగినప్పటి నుండి..చాలా మంది పిల్లలు గల్లంతైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో గాయపడిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. గయానాలోని మహదియా నగరంలోని పాఠశాల హాస్టల్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారించబడలేదు. అదే సమయంలో మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే. మంటలు చెలరేగడంతో వారంతా హాస్టల్‌లోనే చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Read Also:Raviteja : రవితేజ రెమ్యునరేషన్ విషయంలో తర్జనభర్జన పడుతున్న నిర్మాతలు

ఆదివారం అర్ధరాత్రి హాస్టల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అధికారులు సమాచారం అందించారు. మంటలు చెలరేగిన సమయంలో చిన్నారులు నిద్రిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మంటలను అదుపు చేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని.. గాయపడిన చిన్నారులను రాజధాని జార్జ్‌టౌన్‌లో చికిత్స నిమిత్తం చేర్చామని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. మరోవైపు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన, భయంకరమైన ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. ఈ బాధను తాను ఊహించలేనని చెప్పాడు. గాయపడిన పిల్లలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా జార్జ్‌టౌన్‌కు తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐదు విమానాలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. గయానా హాస్టల్‌లో విద్యార్థులు కూడా చిక్కుకున్నారని, వారి అరుపులు వినిపిస్తున్నాయి. ఈ గయానా నగరం బంగారు గనులకు ప్రసిద్ధి చెందింది.

Read Also:Bengaluru: బెంగళూర్ వర్షంలో ఐదుగురిని కాపాడిన “మహిళ చీర”

Show comments