Russia: ఉక్రెయిన్‌లోని ఆ ప్రాంతాలు నేడే విలీనం.. రష్యా అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆక్రమించిన ప్రాంతాలు రష్యాలో శుక్రవారం విలీనం అవుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము విలీనం చేసుకుంటున్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో ఈ విలీనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారని, ఆయా ప్రాంతాలకు చెందిన మాస్కో అనుకూల పరిపాలకులు సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేస్తారని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లోని జార్జియన్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కొత్త భూభాగాల విలీన వేడుక నిర్వహిస్తామని దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రసంగం చేస్తారని వివరించారు. రష్యాలో శాశ్వత విలీనాన్ని కోరుకుంటున్నట్లు రెఫరెండంలో వెల్లడైందని రష్యా వర్గాలు వెల్లడించాయి.
రెఫరెండంపై ఉక్రెయిన్ సహా అమెరికా, ఐరోపా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ విలీన ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సైనిక అధికారులు, ఎన్నికల అధికారులు ఐదు రోజుల పాటు ఇంటింటీకి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా మద్దతున్న నేతలు తాము రష్యాతోనే ఉంటామని.. త్వరలో పుతిన్‌తో సమావేశమవుతామని వెల్లడించారు. కాగా, 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యాను ఆక్రమించుకుంది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత తాజాగా నాలుగు ప్రాంతాలను ఆక్రమించింది. యుద్ధం వల్ల ఇప్పటికే అత్యధిక ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోగా.. మిగిలిన కొద్దిమందితోనే అభిప్రాయ సేకరణ తంతు ముగించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న రష్యా సైనికులు తుపాకులతో ఇంటింటికీ వచ్చి ఉక్రెయిన్ వాసులతో బలవంతంగా ఓట్లు వేయించారని ఆరోపించాయి. ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం అయితే ఇక ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం అసాధ్యం.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Odisha Minister Rita Sahu : తెలంగాణలో చేనేత శైలి అద్భుతం
జపోరిజియా, ఖేర్సన్, లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలు రష్యాలో విలీనానికి అంగీకారం తెలిపాయని పుతిన్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. లిమాన్ నగరం సమీపంలోని పలు గ్రామాలను ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయనీ, త్వరలోనే ఆ నగరం మొత్తాన్ని అవి చుట్టుముట్టబోతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ‘జాతీయ భద్రత, రక్షణ మండలి’ అత్యవసర సమావేశాన్ని శుక్రవారమే నిర్వహించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిర్ణయించారు. రష్యా ఎత్తుగడలపై దీనిలో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!