Site icon NTV Telugu

Astrologer Trap: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని 9 రోజుల క్రితమే లవ్ మ్యారేజ్.. చనిపోతావని చెప్పిన జ్యోతిష్యుడు.. కట్ చేస్తే..

Astriloger

Astriloger

ఓ వైపు ఏఐ రెవల్యూషన్ వరల్డ్ ని సర్ ప్రైజ్ చేస్తుంటే.. మరో వైపు మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నట్లు కనిపిస్తోంది. అక్షర జ్ఞానం ఉన్నవాళ్లు కూడా జ్యోతిష్యం, బాణామతి వంటి వాటిని నమ్ముతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు బాబాలు, జ్యోతిష్యుల ట్రాప్ లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ జ్యోతిష్యుడు నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద బ్రతకలేవు అంటూ విద్యాజ్యోతికి చెప్పడంతో ఆందోళనకు గురైంది. 9 రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతావని జ్యోతిష్యుడు చెప్పినందుకు భయపడి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

Also Read:Xiaomi 17 Ultra: 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో.. షియోమి ఫోన్‌ విడుదల.. ధర ఇదే

బెంగళూరు – యశ్వంతపురలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తూ, 9 రోజుల క్రితమే ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకున్న విద్యాజ్యోతి(29) అనే యువతి. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నది. ఇటీవల విద్యాజ్యోతికి నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద బ్రతకలేవు అంటూ భయపెట్టాడు ఓ జ్యోతిష్యుడు. తొమ్మిది రోజులు పూజలు చేసి, ఆఖరి రోజైన శుక్రవారం తాళి తీసి అమ్మవారికి సమర్పించు. ఆపై నీకు మంచి జరుగుతుందని జ్యోతిష్యుడు ఆమెకు చెప్పాడు.

Also Read:Burj Khalifa: బుర్జ్ ఖలీఫా బీమా ఎంత? దుబాయ్ ఐకాన్ ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి సమాచారం

జ్యోతిషుడి మాటలు విని 9 రోజుల పూజలు చేసింది. చివరి రోజు అమ్మవారికి తాళి తీసివ్వడానికి ముందు గదిలోకి వెళ్ళి, తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యాజ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. జ్యోతిషుడు కరెక్టుగా చెప్పాడా? లేదా ఆమె జ్యోతిషుడు మాట నిజం చేయాలని చనిపోయింది కావచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐటీ జాబ్ చేస్తూ ఇలాంటివి నమ్మడం ఏంటని కొందరు, ఆ జ్యోతిష్యుడిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version